కథను నమ్మి సినిమా తీసే హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉంటాడు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand). హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమా చేసే ఈ టాలెంటెడ్ యాక్టర్ తాజాగా ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న గ్రాండ్‌గా విడుదల కానుంది.
తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ తమిళంలో కణం టైటిల్‌తో విడుదల కానుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సంభాషణలు సమకూరుస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోంది.ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసినట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం.
టైం ట్రావెల్, తల్లీ కొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి , అక్కినేని అమల కీ రోల్స్ చేస్తున్నారు. శర్వానంద్ తల్లి పాత్రలో అమల (Amala) నటిస్తోంది. జేక్స్ బీజోయ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన రషెస్కు మంచి స్పందన వస్తోంది.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?