Aamir Khan – Lokesh Kanagaraj | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు గత ఏడాది నుంచి వార్తలు వైరలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు మిస్టర్ ఫర్ఫెక్ట్. భవిష్యత్‌లో లోకేష్‌తో సినిమా ఉండబోతుందని కన్ఫర్మ్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమిర్.. లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఒక సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. ఇది ఒక భారీ యాక్షన్ సినిమా అని, 2026లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు. ‘సితారే జమీన్ పర్’ సినిమా విడుదలైన తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమానే తన తొలి ప్రాజెక్ట్ అని ఆమిర్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు పీకే సినిమాకు సీక్వెల్ ఉంటుందని వస్తున్న వార్తలను ఆమిర్ ఖండించారు.
లోకేష్ కనగరాజ్ సినిమా అనంతరం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయబోతున్నట్లు ఆమిర్ వెల్లడించారు. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘మహాభారతం’ పై కూడా పనిచేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా, ‘దిల్ చాహతా హై’, ‘3 ఇడియట్స్’, ‘సర్ఫరోష్’ వంటి విజయవంతమైన చిత్రాలకు సీక్వెల్స్ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయని ఆమిర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
లోకేష్ కనగరాజ్ విషయానికొస్తే, ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. యాక్షన్ సినిమాలను తీయడంలో లోకేష్‌కి మంచి పట్టు ఉంది. ఆయన సినిమాలలోని కొత్తదనం, కథ చెప్పే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అయితే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తో కలిసి లోకేష్ కనగరాజ్ ఒక సూపర్ హీరో సినిమా చేస్తుండటంతో ఎలా ఉండబోతుందని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read More