అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) ఇద్దరు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారు. ఆత్మకూరు మండలం ఏఎస్ పేట అడ్డరోడ్డు వద్ద వేగంగా వచ్చిన కారు, వెంకటరావుపల్లి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్‌కు వెళ్తున్న కూలీలు ఆటో ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మరో ఏడుగురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) విచారం వ్యక్త పరిచారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.