N.T Ramarao | దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు ముద్దుల మనవడు జూనియర్ ఎన్టీఆర్ కాదని టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడునందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao)ను వైవీఎస్ చౌదరి టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్న విషయం తెలిసిందే. తెలుగమ్మాయి వీణ రావు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేతలు కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించబోతున్నారు. ఈ చిత్రం తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది.
అయితే ఈ ప్రెస్ మీట్లో మీడియా అడుగుతూ.. సీనియర్ ఎన్టీఆర్‌కి ముద్దుల మనవడు జూ. ఎన్టీఆర్ కదా అని అడుగగా.. వైవీఎస్ మాట్లాడుతూ.. ఎవరు చెప్పారు సీనియర్ ఎన్టీఆర్‌కి ముద్దుల మనవడు జూ. ఎన్టీఆర్ అని.. అది అబద్దం. తారక్ రామరావు గారికి ఇష్టమైన మనవడు జూ. ఎన్టీఆర్ అయితే మిగత మనవళ్లు ఇష్టం లేరని అంటున్నారా. మీడియా ముందే డిసైడ్ అయిపోయి అదే నిజం అని నమ్ముతుంది. జూ. ఎన్టీఆర్ ఒక్కడే రామారావు గారికి ఇష్టమైన మనవడు అనేది మీడియా ఊహించుకున్న కల్పన మాత్రమే ఆది నిజం కాదు. సీనియర్ ఎన్టీఆర్‌కి అతని కుటుంబంలో ఉన్న అందరు సమానమే. అలాగే.. జూ. ఎన్టీఆర్‌కి పేరు హరికృష్ణ పెట్టారు కానీ సీనియర్ ఎన్టీఆర్ పెట్టలేదు. ఇలాంటి రూమర్స్‌ను నమ్మకండి అంటూ వైవీఎస్ తెలిపాడు.
Correct gaa chepparu sir#YVSChowdarypic.twitter.com/OLi5HIx8pb
— ʀᴀɪɴᴀʀᴇᴅᴅʏ_ (@RainaReddy_) August 10, 2024
Also Read..