Naga Chaitanya | అక్కినేని వారసుడు స్టార్ హీరో నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటి సమంతతో విడాకుల అనంతరం మళ్లీ ప్రేమలో పడ్డ చైతూ శోభిత ధూళిపాళ్ల అనే తెలుగు హీరోయిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. గురువారం వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఈ ఏంగేజ్మెంట్ జరిగిన రోజు నాగార్జునతో పాటు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి.
ఇప్పుడు తాజాగా నిశ్చితార్థం జరిగిన రోజు హాజరైన అక్కినేని ఫ్యామిలీతో పాటు శోభిత ఫ్యామిలీ శోభిత తల్లిదండ్రులు వేణు గోపాల్ రావు, శాంతి కామాక్షి ఫొటోలను అక్కినేని టీం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక ఈ ఫొటోలలో నాగార్జున రెండో భార్య అమలతో పాటు అఖిల్, మాజీ భార్య లక్ష్మి దగ్గుబాటి తదితరులు హాజరయ్యారు. అయితే ఈ ఏంగేజ్మెంట్కు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరుకాలేదని సమాచారం. వీరి పెళ్లి ఈ యేడాది కార్తీక మాసంలో జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
శోభితా తల్లిదండ్రుల విషయానికొస్తే.. తండ్రి వృత్తి రీత్యా నేవీ ఆఫీసర్ కావడంతో వీళ్ల కుటుంబం విశాఖకు షిఫ్ట్ అయింది. అక్కడ లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదువుకుంది. ఆ తర్వాత వీళ్లు ముంబైకు షిఫ్ట్ అయ్యారు. అక్కడే శోభితా హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది.
Naga Chaitanya- #ShobithaDhulipala engagement pics pic.twitter.com/5TBYbGdF0F
— Star Talkies (@startalkies_ofl) August 10, 2024
ALso Read..