Samanta Dhulipala | అక్కినేని వారసుడు నాగ చైతన్యను ఎక్కడికి వెళ్లిన సమంత అనే పేరు అతడిని పట్టుకునే ఉంటుంది ఏమో. ఎందుకంటే సమంతతో విడిపోయిన అనంతరం ఆ పేరు మర్చిపోదాం అనుకున్న చైతూకి మళ్ళీ శోభిత రూపంలో లైఫ్‌లోకి వచ్చింది. అర్థం కాలేదు కదా. నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్న శోభిత ధూళిపాళ్ల చెల్లి పేరు కూడా సమంతనే. దీంతో మాజీ భార్య రూపంలో ఆ పేరు దూరం అయిన మరదలి రూపంలో చైతూ లైఫ్‌లోకి మళ్లీ ఆ పేరు వచ్చింది. ఇది చూసిన అక్కినేని అభిమానులు చైతూకి ఎక్కడికి వెళ్లిన సమంత పేరు మాత్రం తప్పట్లే అని కామెంట్లు పెడుతున్నారు.
ఇక నాగ చైతన్య మరదలు సమంత ధూళిపాళ్ల విషయానికి వస్తే.. వృత్తిరీత్యా డాక్టర్. బార్సిలోనా యూనివర్సిటీలో తన డాక్టర్ చదువు పూర్తి చేసి రేడియో రోగ నిర్ధారణ (Radiodiagnosis) విభాగంలో ఎండీగా విధులు నిర్వహిస్తుంది. అక్క కంటే ముందే పెళ్లి చేసుకున్న సమంత ప్రస్తుతం విదేశాల్లో ఉంటుంది.
Also Read..