రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren) ఇవాళ 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన చేతిపై ఖైదీ ముద్ర ఉన్న ఓ ఫోటోను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. జైలు నుంచి రిలీజైన సమయంలో ఆ ముద్ర వేశారు. అన్ని రకాల అన్యాయంపై పోరాటం చేయనున్నట్లు హేమంత్ సోరెన్ తెలిపారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ ముద్ర సంకేతమని ఆయన తన పోస్టులో తెలిపారు.
ఇవాళ నా పుట్టిన రోజు అని, కానీ గత ఏడాదికి చెందిన జ్ఞాపకాలను తనను వెంటాడుతున్నాయని, జైలు నుంచి రిలీజైన సమయంలో తన చేయిపై వేసిన ముద్ర.. ప్రజాస్వామ్య సవాళ్లకు గుర్తుగా ఉంటుందని అన్నారు. ఎన్నికైన సీఎంనే ఎటువంటి ఆధారాలు లేకుండా 150 రోజుల పాటు జైలులో వేస్తే, ఇక సాధారణ ప్రజలు, గిరిజనలు, దళితుల పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
కోట్లు ఖరీదైన భూమికి చెందిన లావాదేవీల్లో అక్రమాలు జరిగిన కేసులో.. సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
आज अपने जन्मदिन के मौक़े पर बीते एक साल की स्मृति मेरे मन में अंकित है – वह है यह कैदी का निशान – जो जेल से रिहा होते वक्त मुझे लगाया गया। यह निशान केवल मेरा नहीं, बल्कि हमारे लोकतंत्र की वर्तमान चुनौतियों का प्रतीक है।
जब एक चुने हुए मुख्यमंत्री को बिना किसी सबूत, बिना कोई… pic.twitter.com/TsKovjS1HY
— Hemant Soren (@HemantSorenJMM) August 10, 2024