NTR Neel | గతేడాది దేవర పార్ట్ 1 గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ గ్లోబల్ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా ఎన్టీఆర్-నీల్ (NTRNeel). ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
చాలా రోజుల తర్వాత ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన వార్తను మైత్రీ మూవీ మూవీస్ నిర్మాత రవి శంకర్ షేర్ చేసుకున్నాడు. ఇవాళ ప్రెస్ మీట్లో రవిశంకర్ ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమాలో అసమానమైనదిగా ఉండబోతుందని అభివర్ణించారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నామని.. ఈ సినిమా అంతర్జాతీయంగా విడుదల అవుతుందని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 9, 2026న ఈ సినిమాను విడుదల చేయడానికి యూనిట్ సిద్ధంగా ఉందని క్లారిటీ ఇచ్చారు.
ఈ చిత్రంలో సప్తసరాగాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్-ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ ఫైనల్ చేయగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తారక్ దీంతోపాటు దేవర పార్టు 2 కూడా చేస్తున్నాడని తెలిసిందే. మరోవైపు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు