Jr NTR | టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన తాజా చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన అభిమానులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. తాను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చిందని పేర్కొన్నారు. దేవర పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు.
‘నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మా సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని చూసి సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. థ్యాంక్యూ కొరటాల శివ గారూ.. అద్భుతమైన డ్రామా, భావోద్వేగాలతో దేవరను తీర్చిదిద్దినందుకు. మై బ్రదర్ అనిరుధ్.. నీ సాంగ్స్, మ్యూజిక్‌తో మా ప్రపంచానికి జీవం పోశావు. ఈ చిత్రానికి బలమైన సపోర్ట్‌గా నిలిచిన నిర్మాతలు హరికృష్ణ కొసరాజు, సుధాకర్ మిక్కిలినేనికి ప్రత్యేక ధన్యవాదాలు.
కెమెరామన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌తోపాటు టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. నా అభిమానుల సంబరాలు చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగింది. మీరు చూపించే ఈ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాలానే మీరూ ఈ చిత్రాన్ని ఆస్వాదిస్తుండటం చూస్తుంటే సంతోషంగా ఉంది. మీ అందరినీ అలరిస్తూనే ఉంటానని హామీ ఇస్తున్నాను’ అని ఎన్టీఆర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
The day I had been waiting for is finally here… Overwhelmed by your incredible reactions.
Thank you Koratala Siva garu, for envisioning Devara with such engaging drama and emotional experience. My brother @anirudhofficial, your music and background score brought this world to…
— Jr NTR (@tarak9999) September 27, 2024
దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 నేడు (సెప్టెంబర్ 27న) థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించగా.. జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకులకు పరియమైంది. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Also Read..
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
12th Fail | విక్రాంత్ మాస్సే 12th ఫెయిల్‌కి అరుదైన గౌరవం.. సుప్రీంకోర్టులో చిత్ర ప్రదర్శన
Saif Ali Khan | ఆయన ధైర్యవంతుడైన నిజాయితీ గల రాజకీయ నాయకుడు.. రాహుల్‌పై సైఫ్ అలీఖాన్ ప్రశంసలు