Bandla Ganesh | టిల్లు 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda) నటించిన చిత్రం తెలుసు కదా (Telusu Kada). పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి, రాశీఖన్నాఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
తెలుసు కదా సక్సెస్ మీట్లో నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడిన మాటలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. మా తమ్ముడు ఎస్కేఎన్ (నిర్మాత) ఇప్పుడే చెప్పాడు.. అన్నా నువ్వు రా అన్నా అని. నేను బ్లాక్ బస్టర్ ఇచ్చే బ్రేక్ ఇచ్చా.. ఇప్పుడు మొదలవుతది కొత్త సెకండాఫ్. టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్‌తో బ్రేక్ ఇచ్చాను.. ఫ్లాప్‌తో నేను బ్రేక్ ఇయ్యలేదు. బ్లాక్ బస్టర్‌తో బ్రేక్ ఇచ్చా.. ఇక మొదలవుతుంది సినిమా అని నేను చెప్తూ.. మీ ఆశీస్సులు కోరుకుంటున్నానన్నాడు బండ్ల గణేశ్.
ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. ఇంతకీ రీఎంట్రీ సినిమా ఎవరితో చేస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు సిద్దు జొన్నలగడ్డ గురించి మాట్లాడుతూ.. చిరంజీవి స్వయంకృషి చేశాడు.. ముఠామేస్త్రీ చేశాడు. వెంకటేశ్ బొబ్బిలి రాజా చేశాడు. చంటి చేశాడు. నాగార్జున గీతాంజలి చేశాడు.. శివ చేశాడు. సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు.. తెలుసు కదా చేశాడు.
ఈ సినిమాలో సిద్దు ఇరగ్గొట్టేశాడు. జోష్ సినిమాలో ఏ అడ్రస్ లేకుండా, ఏ కేరాఫ్ లేకుండా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ముందూ వెనుకాఎవరూ లేకుండా నేను నటుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తపించిన సిద్దు.. ఈ సినిమా తర్వాత రవితేజకు ప్రత్యామ్నాయం అవుతాడని నిజంగా చెప్తున్నానన్నాడు.
Biopic | ఛావా డైరెక్టర్ కొత్త బయోపిక్ .. తెరపైకి ఫోక్ డాన్సర్ జీవిత చరిత్ర
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?
Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సారా అలీ ఖాన్.. ఫొటోలు