టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప (Pushpa). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త అటు బీటౌన్ తోపాటు ఇటు టాలీవుడ్ సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది. ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా ఓ ఐటెంసాంగ్ ను పెట్టాడు సుకుమార్.
ఈ పాటలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి (Nora Fatehi) పుష్పరాజ్ తో కలిసి స్టెప్పులేయనుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే పాట కోసం సంప్రదించగా నోరా ఫతేహి రూ.2 కోట్లు రెమ్యునరేషన్ అడిగిందన్న మరో వార్త కూడా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ కెనడియన్ భామను మేకర్స్ ప్రత్యేక పాటలో తీసుకుంటారా..? లేరా..? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
దక్షిణాదిన ఐటెం సాంగ్ చేయడం నోరా ఫతేహీకి కొత్తేమి కాదు. ఇప్పటికే బాహుబలి..ది బిగినింగ్, టెంపర్ సినిమాల్లో ఆడిపాడింది నోరా. ఇక ఇపుడు డ్యాన్స్ ఇరగదీసే అల్లు అర్జున్ లాంటి నటుడితో సిల్వర్ స్క్రీన్ పై స్టెప్పులేయనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరు డ్యాన్సింగ్ స్టార్లు ఐటెంసాంగ్ లో మెరుస్తారో..? లేదో..? చూడాలి.
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు