Sonakshi Sinha | ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మరో వివాదంలో చిక్కుకుంది. ఛీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. సోనాక్షి సిన్హాపై మొరదాబాద్‌కు చెందిన ఈవెంట్ మేనేజర్ ప్రమోద్ శర్మ ఫ్రాడ్ కేసు పెట్టారు. తాను ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనాక్షి సిన్హా.. రూ.37 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని, కానీ తాను ఆ ఈవెంట్లో పాల్గొనలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనివల్ల తీవ్ర నష్టం వచ్చిందని ప్రమోద్ శర్మ పోలీసులను ఆశ్రయించారు.
ఇదే విషయంలో డబ్బులు తిరిగి చెల్లించాలని సోనాక్షి మేనేజర్‌ను ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని ప్రమోద్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసులో సోనాక్షి సిన్హా గతంలో ఒకసారి మొరదాబాద్‌కు వచ్చి వివరణ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత విచారణకు హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా రహస్యంగా వివాహం చేసుకున్నారని ఇటీవల ఒక ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది మార్పింగ్ ఫొటో అని తెలిసింది. దీనిపై సోనాక్షి కూడా ఘాటుగానే స్పందించింది. రియల్ ఫొటోకు, మార్ఫింగ్ ఫొటోకు తేడా తెలియట్లేదా అని సీరియస్ అయ్యింది. ఇదిలా ఉంటే సల్మాన్‌తో కలిసి ఇటీవల ద-బాంగ్ టూర్‌కు వెళ్లొచ్చింది సోనాక్షి సిన్హా. ఈ టూర్లో పూజా హెగ్డే, దిశా పటానీ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం హ్యూమా ఖురేషితో కలిసి డబుల్ ఎక్స్ ఎల్, రితేష్ దేశ్ ముఖ్‌తో కాకుడా చిత్రాల్లో నటిస్తోంది సోనాక్షి సిన్హా.