Telangana Exhibitors | తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ బాగుండాలంటే పర్సంటేజీ విధానంలో సింగిల్ స్క్రీన్లు రన్ చేయడం తప్పనిసరి అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అభిప్రాయపడ్డది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ విషయంలో ఎగ్జిబిటర్లంతా ఓ నిర్ణయానికి వచ్చామన్నారు.
దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ మాట్లాడుతూ.. సింగిల్ స్క్రీన్ ధరలు పెంచొద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎగ్జిబిటర్స్ బ్రతుకు పోరాటం. ఈ పర్సంటేజ్ విధానాన్ని నిర్మాతలంతా అర్థం చేసుకోండి. మాకు మద్దతు ఇవ్వండి. తెలుగులో సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి. ఇప్పుడంతా ఓటీటీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. థియేటర్‌ను పక్కన పెట్టేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం జీవో ఇచ్చినా తాము ధరలు పెంచమని.. ఇది ప్రేక్షకులకు ఇస్తున్న హామీ అని ప్రకటించారు.
మరోవైపు సింగిల్ స్క్రీన్లను గోడౌన్‌కు అద్దెకు ఇస్తే ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయని ఎగ్జిబిటర్ నరేందర్ అన్నారు. ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ.. 2008 నుంచి పర్సంటేజ్ కోసం కొట్టాడుతున్నాం. హరిహరవీరమల్లు సమయంలో మాట్లాడితే థియేటర్లు మూసేస్తున్నామని నెగెటివ్ ప్రచారం చేశారు. అన్నీ ప్రొడక్షన్ కంపెనీలు నిదానంగా పర్సంటేజ్ పద్దతి వైపే వస్తున్నాయి. అందరూ ఈ విధానానికి వస్తే మేము థియేటర్లు నడుపుతామన్నారు.
Telengana Exhibitiors Association Pressmeet pic.twitter.com/ryn3kUSLq3
— Telugu Film Producers Council (@tfpcin) May 12, 2026
బండి భగీరథ్‌పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు : అడ్వకేట్ లలితా రెడ్డి
KTR | విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం.. నీట్ రద్దుపై కేటీఆర్