Ram Pothineni | ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది. మరోవైపు ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.
మిస్టర్ బచ్చన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఫెయిల్యూర్‌గా నిలిచింది. కాగా ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటూ ఇప్పటికే కొన్నాళ్లుగా నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయని తెలిసిందే. మరోవైపు మహేశ్ బాబు పీ డైరెక్షన్లో రామ్ సినిమా చేయబోతున్నాడని కొత్త అప్డేట్ కూడా వచ్చేసింది. మరి హరీష్ శంకర్‌తో సినిమా సంగతేంటనే దానిపై తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది.
ఫిలిం నగర్ సర్కిల్ తాజా కథనాల ప్రకారం రామ్-హరీష్ శంకర్ ప్రాజెక్ట్ అటకెక్కినట్టేనని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికి హరీష్‌శంకర్‌తో సినిమా చేసేందుకు రామ్ సిద్దంగా లేడట. ఈ లెక్కన వీరి కాంబోలో సినిమా రావడం ఇప్పట్లో లేనట్టేనని అర్థమవుతోంది. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టడబోతున్నాడట.
మరి భవిష్యత్‌లోనైనా రామ్-హరీష్ సినిమా ఉంటుందేమోనన్నది చూడాలి. రామ్ నెక్ట్స్ మూవీ టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రానుందని తెలుస్తోండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్‌ను అలా కలిశారో లేదో.. ఇలా హరిహరవీరమల్లు షూట్ షెడ్యూల్
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?