Pushpa Pre Release Event | పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథులు లేనట్టే
అల్లు అర్జున్ (Allu Arjun) చేస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa) త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు..

టాలీవుడ్ (Tollywood) హీరో అల్లు అర్జున్ (Allu Arjun) చేస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa). సుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
మేకర్స్ మాట్లాడుతూ..డిసెంబర్ 17న అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో కలిపి 3000 స్క్రీన్లకుపైగా విడుదల చేస్తున్నాం. వీటిలో తెలుగు థియేటర్లలో సుమారు 1000కి పైగా ఉన్నాయని చెప్పారు. డిసెంబర్ 16న ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడతాయి. సినిమా చూశాం..చాలా ఎక్జయటింగ్ గా ఉంది. పుష్ప బ్లాక్ బాస్టర్ అవడం ఖాయం. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశామని అన్నారు. ఇది యూనివర్సల్ సబ్టెక్టు..అందరి నచ్చుతుంది. ఈ సినిమాలో కొత్త అల్లు అర్జున్ ను చూస్తారు. పుష్ప కోసం అల్లు అర్జున్ కష్టపడ్డ తీరు కానీ..ఆయన వాడిన యాసకు కానీ చాలా పెద్ద పేరొస్తదని చెప్పుకొచ్చారు.
అయితే నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథులు ఎవరు లేరని చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎవరెవరు రాబోతున్నారు..అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ లవర్స్ కు చీఫ్ గెస్టులెవరు లేరని చెప్పడం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇటీవలే విడుదలైన పుష్ప ట్రైలర్ (Pushpa trailer)కు అద్బుతమైన స్పందన వస్తోంది.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’లో పాటపాడిన దుర్గవ్వకు సన్మానం
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

