మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులకు దగ్గరైంది తమిళ సోయగం నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj). ఆ తర్వాత పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తాజాగా విశ్వక్ సేన్ తో కలిసి పాగల్ సినిమాలో నటిస్తోంది. అయితే ఇప్పటివరకు మేకర్స్ నుంచి తన దగ్గరకు ఎక్కువగా సీరియస్ రోల్స్ ఆఫర్లు వచ్చాయని, ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుందని చెప్పింది. పాగల్ సినిమాలో కూడా తనది కాస్త సీరియస్ టచ్‌తో ఉన్న పాత్ర కావడంతో పూర్తి స్థాయిలో సంతోషంగా లేనని అంటోంది. ఇక నుంచి తనలోని గ్లామరస్ యాంగిల్ ను ఎలివేట్ చేసే పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపిస్తానంటోంది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నివేదా పేతురాజ్ మాట్లాడుతూ..ప్రతీ సారి సీరియస్ పాత్రలు చేసి చేసి అలసిపోయాను. నా దగ్గరకు వచ్చే డైరెక్టర్లు ఇక నుంచి క్రేజీ, గ్లామరస్ పాత్రలతో వస్తారని ఆశిస్తున్నానని తన మనసులో మాటను చెప్పుకొచ్చింది. మరి నివేదా పేతురాజ్ కోరుకున్నట్టుగా ఫిల్మ్ మేకర్స్ అలాంటి పాత్రల్లో అవకాశమిస్తారా..? లేదా అనేది చూడాలి.
ప్రస్తుతం వేణు ఉడుగుల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది నివేదా పేతురాజ్. దీంతోపాటు చందూమొండేటి డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..తమిళంలో రెండు సినిమాలను లైన్ లో పెట్టింది నివేదా పేతురాజ్.
పాగల్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి..
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?