Thammudu | టాలీవుడ్ యాక్టర్ నితిన్ (Nithiin) ఇటీవలే ‘తమ్ముడు’ (Thammudu)తో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. వకీల్ సాబ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నఈ మూవీలో జులై 4న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు భారీ నిరాశనే మిగిల్చింది. మరోవైపు నిర్మాత దిల్ రాజుకు కూడా థ్రియాట్రికల్ రన్ నష్టాలనే మిగిల్చింది. ఎమోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే కథనాన్ని అందించే ప్రయత్నం చేసిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ వ్యూవర్స్‌ను ఇంప్రెస్ చేయడంలో విఫలమయ్యాడు.
కాగా ఈ చిత్రం ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో ప్రీమియర్ అయింది. అయితే తాజా ఫీల్ అందించడంలో.. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో వెనకబడిందని చాలా మంది వ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేయగా.. నితిన్ రీసెంట్ కథలతో పోలిస్తే ఉత్తమంగా ఉందంటూ మరికొందరు పేర్కొన్నారు. ఈ సినిమాతో సప్తమి గౌడ, స్వసిక టాలీవుడ్ డెబ్యూ ఇచ్చారు. సీనియర్ నటి లయ ఈ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇచ్చింది. ఈ తారల ఎంట్రీ సినిమాపై ఆసక్తిని పెంచినప్పటికీ.. వారి పాత్రలు మాత్రం ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. ఇక వర్ష బొల్లమ్మ తన నటనతో సినిమాకు హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.
ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. నితిన్ నెక్ట్స్ బలగం ఫేం వేణు యెల్దండి డైరెక్షన్లో ఎల్లమ్మ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే.
Watch Thammudu now on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada!#ThammuduOnNetflix
— Netflix India South (@Netflix_INSouth) August 2, 2025
Kantara 3 | కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్… ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Kamal Hassan | సనాతన బానిసత్వాన్ని అంతంచేసే ఆయుధం అదొక్కటే.. కమల్ హాసన్
Film Chamber | లేబర్ కమిషనర్‌ను కలవనున్న ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యులు