Nithiin Tammudu | టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తమ్ముడు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ నటి సప్తమి గౌడ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని 2025 జూలై 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ కూడా జూలై 04న రానుండటంతో ఈ సినిమా వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా అనుకున్న తేదీకే ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్ అప్డేట్ను పంచుకుంది. ఈ మూవీ ట్రైలర్ను జూన్ 11న సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఈ సినిమాలో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు.
Read More