Dusting : ‘డస్టింగ్ ఛాలెంజ్ (Dusting Challenge)’ అనే మరో సోషల్ మీడియా ట్రెండ్ (Social Media Trend) యువతతోపాటు మైనర్ బాలబాలికల ప్రాణాలు తీస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం పలువురు ఈ ‘డస్టింగ్ ఛాలెంజ్ ట్రెండ్’ను ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యి తాజాగా అమెరికాలో 19 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది.
డస్టింగ్ ఛాలెంజ్‌లో భాగంగా 19 ఏళ్ల యువతి రెన్నా ఓ రూర్కీ (Renna O Rourke) తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎరోసాల్ కీ బోర్డు క్లీనర్‌ను ఆర్డర్ చేసింది. ఆ తర్వాత ఆ కీబోర్డు క్లీనర్ వాసన పీల్చి రూర్కీ కార్డియాక్ అరెస్ట్‌కు గురైంది. పేరెంట్స్ ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా నాలుగు రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొంది ప్రాణాలు కోల్పోయింది.
తన కుమార్తె ఎప్పుడూ తాను ‘ఫేమస్ కాబోతున్నాను, ఫేస్ కాబోతున్నాను’ అని చెప్పేదని, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని రూర్కీ పేరెంట్స్ విలపించారు. కాగా డస్టింగ్ అనే సోషల్ మీడియా ట్రెండ్‌కే ‘క్రోమింగ్’, ‘హఫింగ్’ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ట్రెండ్ ఇప్పుడు వైరల్ ట్రెండ్‌గా మారింది. వ్యూస్ కోసం.. ఇళ్లలో వినియోగించే క్లీనర్స్ వాసన పీల్చడమే ఈ డస్టింగ్ ఛాలెంజ్.
అయితే ఈ ఛాలెంజ్‌లో భాగంగా రూర్కీ.. ప్రమాదకరమని తెలియక ఎరోసాల్ కీబోర్డు క్లీనర్ వాసన పీల్చింది. దాంతో కార్డియాక్ అరెస్ట్‌కు గురై ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ట్రెండ్ ఇతర దేశాల కంటే అమెరికాలోనే బాగా ప్రాచుర్యంలో ఉంది.