Nithiin | టాలీవుడ్ యాక్టర్ నితిన్ కెరీర్ చాలా కాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలతో సాగుతుందని తెలిసిందే. భీష్మ తర్వాత నితిన్‌కు సరైన హిట్టు పడలేదు. రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలపై భారీ అంచనాలే పెట్టుకున్న నితిన్‌కు ఈ రెండు ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశనే మిగిల్చాయి. రెండూ భారీ డిజాస్టర్స్‌గా మిగిలిపోయాయి.
ఇక నెక్ట్స్ వేణు యెల్దండితో ఎల్లమ్మ, విక్రమ్ కే కుమార్‌తో మరో సినిమాను లైన్లో పెట్టాడు నితిన్. వీటిలో విక్రమ్ కే కుమార్‌తో చేయబోయే సినిమా హై బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా ఉండబోతుందని గతంలో వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజా టాక్ ప్రకారం ఈ మూవీలో నితిన్ హార్స్ రైడర్ (గుర్రపు స్వారీ చేసే వ్యక్తి) గా కనిపించబోతున్నాడట. అంతేకాదు మేకర్స్ ఈ చిత్రానికి స్వారీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్లో వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరి నితిన్ ఒకేసారి ఎల్లమ్మ, విక్రమ్ కే కుమార్ సినిమాలను చేస్తాడా..? లేదంటే ఏదైనా ఒక సినిమాపై మాత్రమే ఫోకస్ పెడతాడా..? అన్నది తెలియాల్సి ఉంది. ఇష్క్ సినిమాతో నితిన్ కెరీర్‌కు బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చాడు విక్రమ్ కే కుమార్. మరి నితిన్, విక్రమ్ కే కుమార్ కాంబోలో వచ్చే సినిమా ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
Pawan Kalyan | ఓజీ కోసం వన్స్‌మోర్ అంటోన్న పవన్ కల్యాణ్.. ఏ విషయంలోనో తెలుసా..?
Vijay Devarakonda | ‘కింగ్డమ్’ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
Param Sundari | విడుదల తేదీని ప్రకటించిన జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’