సాయిపల్లవి, రణబీర్‌కపూర్ సీతారాముల పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. నితీష్ తివారి దర్శకత్వంలో రెండు భాగాలుగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముంబయిలోని ఫిల్మ్‌సిటీలో రెండు వారాల క్రితం షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాకు ఆది నుంచి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. సీతారాముల పాత్రల్లో సాయిపల్లవి, రణబీర్‌కపూర్ లుక్‌టెస్ట్ ఫొటోలు బయటకు రావడం చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టింది.
తాజాగా నిర్మాత మధు మంతెన ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సినిమా షూటింగ్‌కు మూడు వారాలు బ్రేక్ పడిందని సమాచారం. ముంబయి మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ‘రామాయణ’ ప్రాజెక్ట్ విషయంలో తనుకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను సెటిల్ చేసిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాలని నిర్మాత మధు మంతెన నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
ఈ వివాదంతో పాటు సినిమా స్క్రిప్ట్ విషయంలో నెలకొన్న కాపీరైట్ ఉల్లంఘన అంశం కూడా షూటింగ్‌కు బ్రేక్ పడటానికి కారణంగా చెబుతున్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విషయంలో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సినిమాలో కన్నడ అగ్ర హీరో యష్ రావణుడి పాత్రను పోషిస్తుండగా, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.