SPY | గతేడాది కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు యువ హీరో నిఖిల్ (Nikhil). ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్పై (SPY)లో నటిస్తున్నాడు. పాపులర్ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. Ed Entertainments బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా స్పై అప్డేట్ అందించాడు నిఖిల్. స్పై పనులు మళ్లీ షురూ కానున్నాయి.
స్పై చిత్రానికి సంబంధించి నేటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఉండబోతున్నాయని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు నిఖిల్ .స్పె నాన్ థ్రియాట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.40 కోట్లతో నాన్ థ్రియాట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు ఇన్సైడ్ టాక్. నిఖిల్ కెరీర్లో ఇదే టాప్. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం స్పై పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఐశ్వర్యా మీనన్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కే రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈ సినిమాకు స్టోరీ కూడా అందిస్తుండటం విశేషం.
Blasting from TOMORROW 🔥💥 #SPY pic.twitter.com/4gbEgMZ1Ck
— Nikhil Siddhartha (@actor_Nikhil) May 4, 2023
Megastar vs Superstar | మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. బాక్సాఫీస్ క్రేజీ ఫైట్
Ugram | మూవీ లవర్స్‌కు అందుబాటులో అల్లరి నరేశ్ ఉగ్రం టికెట్ ధరలు
Malvika Nair | నాకు అన్ని రకాల కళలు ఇష్టం : మాళవికా నాయర్