Megastar vs Superstar | మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. బాక్సాఫీస్ క్రేజీ ఫైట్
Megastar vs Superstar | ఓ వైపు మెగాస్టార్.. మరోవైపు సూపర్ స్టార్ ఒకేసారి బాక్సాఫీస్ పోటీకి రెడీ అవుతున్నారంటే మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌కు గురయ్యే విషయమే కదా. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , రజినీకాంత్ (Rajinikanth) ఒక్క రోజు వ్యవధిలోనే బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారు.
Megastar vs Superstar | బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ సర్వసాధారణంగా ఉండేదే. అయితే కొందరు స్టార్ హీరోల మధ్య పోటీ మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇప్పుడలాంటి ఇంట్రెస్టింగ్ ఫిలింనగర్లో రౌండప్ చేస్తోంది. ఓ వైపు మెగాస్టార్.. మరోవైపు సూపర్ స్టార్ ఒకేసారి బాక్సాఫీస్ పోటీకి రెడీ అవుతున్నారంటే మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌కు గురయ్యే విషయమే కదా. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటిస్తోన్న భోళాశంకర్ (Bhola Shankar) ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న జైలర్ (Jailer)ఆగస్టు 10న విడుదల కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
అంటే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక్క రోజు వ్యవధిలోనే బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి, రజినీకాంత్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో మంచి మార్కెట్ ఉంటుంది. తాజా టాక్ ప్రకారం ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల వరకు బిజినెస్ చేయొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి మెగాస్టార్, సూపర్ స్టార్ మధ్య పోటీ బాక్సాఫీస్‌ను ఎలా ప్రభావితం చేస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
జైలర్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునీల్, తమన్నా, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు
వేదాళమ్ రీమేక్‌గా వస్తోన్న భోళా శంకర్ చిత్రానికి మెహర్‌రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తిసురేశ్ నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. భోళా శంకర్ చిత్రానికి మహతి స్వరసాగర్ మ్యూజిక్ డైరెక్టర్. భోళా శంకర్లోలో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

