Anni Manchi Sakunamule | హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది మాళవికా నాయర్. నందినీ రెడ్డి (Nandhini Reddy) దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule) చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో సంతోష్ శోభన్ (Santosh Soban) హీరోగా నటిస్తున్నాడు. మే 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా చేసిన చిట్‌చాట్‌లో పలు విషయాలు షేర్ చేసుకుంది మాళవికా నాయర్.
నాది కేరళ.. నా జీవితంలో ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉన్నా. వైజయంతి మూవీస్ నా కుటుంబం లాంటిది. నేను చాలా ప్రైవేట్ పర్సన్‌ను.. కెరీర్ తొలినాళ్లలో సినిమా ప్రయాణం మొదలుపెట్టేందుకు చాలా స్ట్రగుల్ అయ్యా. నాకు అన్ని రకాల కళలంటే ఇష్టం..పెయింటింగ్ వేయడం చాలా ఇష్టం. ఇటీవలే నేను క్రోచెటింగ్ చేయడం మొదలుపెట్టానని చెప్పింది మాళవికా నాయర్. ఈ భామ మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న తంగలాన్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
మహానటి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మూవీ లవర్స్ కు అందించిన స్వప్నా దత్, ప్రియాంకా దత్ మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేశ్, రావు రమేశ్, వెన్నెల కిశోర్, షావుకారు జానకి, వాసుకి, రమ్య సుబ్రమణియన్, అర్జుణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గౌతమి మీనాక్షి పాత్రలో కనిపించనుండగా.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.