Ugram | మూవీ లవర్స్‌కు అందుబాటులో అల్లరి నరేశ్ ఉగ్రం టికెట్ ధరలు
Ugram | అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తోన్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). ఉగ్రం థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో టికెట్ ధరలకు సంబంధించి అప్డేట్ బయటకు వచ్చింది.
Ugram | అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తోన్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). నాంది ఫేం విజయ్ కనకమేడల (Vijaykanaka medala) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నేడు ప్రేక్షుకుల ముందుకొచ్చింది. ఉగ్రం థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో టికెట్ ధరలకు సంబంధించి అప్డేట్ బయటకు వచ్చింది. ఏపీ, తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.110గా ఉంది. తెలంగాణలో మల్టీప్లెక్స్‌లలో రూ.195 (కొన్ని ప్రీమియం థియేటర్లు మినహా)గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మల్టీప్లెక్స్ ధర రూ.177గా నిర్ణయించారు.
సినిమాకు మంచి టాక్ వస్తే థియేటర్లకు ప్రేక్షకులనురప్పించడంలో అందుబాటులో ఉన్న టికెట్ ధరలు బాగా కలిసొస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. నాంది తర్వాత విజయ్ కనకమేడల, అల్లరి నరేశ్ కాంబినేషన్లో రెండోసారి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. వరుస మిస్సింగ్ కేసులు నమోదు కావడం, వాటిని అల్లరి నరేశ్ పోలీసాఫీసర్‌గా ఎలా చేధించాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
అల్లరి నరేశ్ డ్యూయల్ షేడ్స్‌లో ప్రేక్షకులు ఇదివరకెన్నడూ చూడని లుక్‌లో కనిపించబోతున్నట్టు రివీల్ చేసి.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తు్న్నాడు డైరెక్టర్. ఈ చిత్రంలో మలయాళ భామ మిర్నా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఉగ్రం చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు.

Ugram
ఉగ్రం ట్రైలర్..
చాప్టర్-1 ఇంటెన్స్ నైట్ షూట్ మేకింగ్..
చాప్టర్- 2 పవర్ ఫుల్ ఫైట్ మేకింగ్..
ఉగ్రం టీజర్..
దేవేరి వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

