Nikhil Siddhartha | కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కెరీర్‌పరంగా ఎంతో నష్టపోతున్నామని అంటున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కొవిడ్ కారణంగా ఒప్పందం చేసుకున్న సినిమాలేవీ అనుకున్న టైమ్‌కు షూటింగ్ చేయలేకపోతున్నామని అన్నాడు. తనలాంటి యంగ్ ఆర్టిస్టులకు ఇది చాలా ఇబ్బందికర సమయమని నిఖిల్ వాపోతున్నాడు. తన కరోనా కష్టాలపై ఒక ట్వీట్ చేశాడు నిఖిల్. కొవిడ్ వల్ల నటుడిగా తను ఎలాంటి ఇబ్బంది పడుతున్నాడో ట్వీట్లో పేర్కొన్నాడు.
కరోనా మహమ్మారి కారణంగా నా కెరీర్ చాలా దెబ్బతింది. అర్జున్ సురవరం సినిమా సక్సెస్ తర్వాత నాలుగు సినిమాలకు సైన్ చేశాను. ఈ నాలుగు కూడా అద్భుతమైన కథలు. ఈ స్క్రిప్టులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ కరోనా కారణంగా అనుకున్న ప్లాన్స్ అన్నీ దెబ్బతిన్నాయి. ఒక్క సినిమాను కూడా అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేయలేకపోయాం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అన్ని పోవాలని.. అనుకున్న టైమ్‌కు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూడాలని ఆ దేవుడని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్ సిద్ధార్థ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Bro Daddy | దర్శకుడిగా వరుసగా రెండో హిట్ కొట్టిన స్టార్ హీరో..
Pushpa 2 | పుష్ప 2 సినిమాకు 400 కోట్ల ఆఫర్.. నిర్మాతలు ఏమన్నారంటే..?
రికార్డ్ ఓపెనింగ్స్.. కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు.. బంగార్రాజు 13 రోజుల కలెక్షన్స్ ఇవీ..
ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్.. ఇందులో నిజమెంత?