Bro Daddy | దర్శకుడిగా వరుసగా రెండో హిట్ కొట్టిన స్టార్ హీరో..

Prithviraj Sukumaran Bro Daddy movie in Disney Plus Hotstar | సాధారణంగా స్టార్ హీరోలు నటనపై మాత్రమే దృష్టి పెడతారు. కొద్దిమంది మాత్రమే యాక్టింగ్‌తో పాటు మిగిలిన శాఖలపై కూడా ఫోకస్ చేస్తుంటారు. ఇక డైరెక్షన్ చేసిన హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోల్లో మాత్రం మెగా ఫోన్ పట్టిన వాళ్లు ఎవరూ లేరు. కానీ మలయాళంలో మాత్రం మెగా ఫోన్ పట్టి వరుస విజయాలను అందుకుంటున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్.
కన్నడ ఇండస్ట్రీలో సుదీప్ కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలు హిట్టయ్యాయి. కానీ అవి సొంత కథలు కాదు.. రీమేక్ సినిమాలే. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం సొంత కథలతో సక్సెస్ అవుతున్నాడు. 15 ఏండ్లుగా మలయాళంలో స్టార్ హీరోగా వెలిగిపోతున్న పృథ్వీరాజ్ సుకుమారన్.. రెండేండ్ల క్రితం లూసిఫర్ సినిమాతో దర్శకుడిగా మారాడు. పొలిటికల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో మోహన్‌లాల్ హీరోగా నటించాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పృథ్వీరాజ్లో ఇంత అద్భుతమైన దర్శకుడు ఉన్నాడా అని అందరూ షాకయ్యేలా విజయాన్ని అందుకుంది. ఇదే సినిమాను తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మరో సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈసారి మోహన్ లాల్‌తో పాటు తాను కూడా ఈ సినిమాలో హీరోగా నటించాడు. బ్రో డాడీ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26న డిస్నీ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలైంది. తండ్రీకొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ స్టోరీతో వచ్చిన బ్రోడాడీ సినిమాకు మంచి అప్లాజ్ వస్తోంది.

బ్రో డాడీ సినిమాతో దర్శకుడిగా మరోసారి ఆకట్టుకున్నాడని పృథ్వీరాజ్ సుకుమారన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సున్నితమైన కథను తీసుకొని అద్భుతమైన హాస్యం పండిస్తూ ఎంటర్టైనింగ్ సినిమాగా బ్రో డాడీ తెరకెక్కించాడు పృథ్వీరాజ్. ఈ సినిమాలో మోహన్ లాల్‌కు జోడీగా మీనా.. పృథ్వీరాజ్‌కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటించారు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను చూస్తుంటే.. ఇది కూడా తెలుగులో రీమేక్ కావడం ఖాయమని అనిపిస్తోంది. మొత్తానికి ఇన్నేండ్లు నటుడిగా ఆకట్టుకున్న పృథ్వీరాజ్ ఇప్పుడు దర్శకుడిగా కూడా అద్బుతాలు చేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Pushpa 2 | పుష్ప 2 సినిమాకు 400 కోట్ల ఆఫర్.. నిర్మాతలు ఏమన్నారంటే..?
సమంత, నాగచైతన్య గురించి నేను అలా మాట్లాడలేదు.. రూమర్స్‌పై నాగార్జున ట్వీట్
ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్.. ఇందులో నిజమెంత?
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

