గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న చిత్రం సలార్ (Salaar), కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. అండర్ వరల్డ్ యాక్షన్ కథాంశంతో వస్తున్న సలార్‌లో శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడట.
అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేరళలో పృథ్విరాజ్కున్న పాపులారిటీతో సలార్‌పై క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈ స్టార్ యాక్టర్‌కు అయ్యా, ఔరంగజేబ్, నామ్ శబానా చిత్రాలతో హిందీలో కూడా మంచి పాపులారిటీ ఏర్పడింది. ఫాలోవర్లు కూడా చాలానే ఉన్నారు.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్