SLW vs NZW : మహిళల టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక అదిరే బోణీ కొట్టింది. సౌతాంప్టన్ మైదానంలో న్యూజిలాండ్‌ను లంక చిత్తు చేసింది. 151 పరుగుల ఛేదనలో టాపార్డర్ విఫలమైనా.. నీలాక్షిక సిల్వా(54 నాటౌట్), కౌషనీ నుత్యంగన(24 నాటౌట్)లు వైట్ ఫెర్న్ ఆశలపై నీళ్లు చల్లారు. క్రీజనంటుకున్న ఈ ద్వయం చివరిదాకా నిలబడి 5 వికెట్ల తేడాతో జట్టును గెలిపించింది. దాంతో.. మెగా టోర్నీలో కివీస్‌కు వరసగా రెండో ఓటమి ఎదురైంద.
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక పాయింట్ల ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో చేతిలో ఓడిన లంక.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను వణికించింది. తొలుత లంక బౌలర్లు కట్టడి చేసినా.. మేలియా ఖేర్(45), సోఫీ డెవినె(45)లు రాణించగా కివీస్ 150 రన్స్ కొట్టింది. అనంతరం ఛేదనలో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది లంక. ఆ దశలో క్రీజులోకి వచ్చిన నీలాక్షిక సిల్వా(54 నాటౌట్), కవిశ దిల్హరి(17) పట్టుదలగా ఆడారు.
Nilakshika Silva powers Sri Lanka to a famous victory – two defeats from two for defending champions New Zealand 😮 #T20WorldCup pic.twitter.com/qZI3H8ecsN
— ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2026
టాపార్డర్ తేలిపోయిన చోట కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న నీలాక్షిక, కవిశ ద్వయం ఐదో వికెట్‌కు యాభై రన్స్ జోడించింది. వీరిద్దరూ స్కోర్ వంద దాటించగా.. కౌషనీ నుత్యంగన(24 నాటౌట్) జతగా నీలాక్షి లాంఛనం ముగించింది. చివరి ఓవర్లో నాలుగో బంతికి కౌషనీ బౌండరీ బాదడంతో లంక ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా వరసగా రెండో ఓటమితో న్యూజిలాండ్ నిరాశలో కూరుకుపోయింది. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడిన నీలాక్షి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికైంది.
New Zealand set Sri Lanka a target of 151 in a must-win clash in Southampton – have the defending champions got enough?
Follow the chase: https://t.co/vEEd2lgVFn pic.twitter.com/ra9cMJvlfY
— ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2026