Sarpreet Singh : ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత సంతతి యువకులు ఆకట్టుకుంటున్నారు. అరంగేట్రం టోర్నీలోనే సత్తా చాటుతూ అభిమానుల మనసులు చూరగొంటున్నారు. మొన్న నిషాన్ వెలుపిలయ్(Nishan Velupillay) సబిస్టిట్యూట్ ప్లేయర్‌గా మైదానంలో మెరవగా.. మంగళవారం మ్యాచ్‌లో సర్ప్రీత్ సింగ్ (Sarpreet Singh) తళుక్కుమన్నాడు. మిడ్‌ఫీల్డర్ అయిన సర్ప్రీత్ న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. దాంతో, ఫిఫా ప్రపంచకప్‌లో ఆడిన భారత సంతతి తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
భారత సంతతి వ్యక్తులు విదేశీ గడ్డపై పలు క్రీడల్లో రాణించడం చూశాం. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా తరఫున నిషాన్ వెలుపియన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా మైదానంలో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్ ఆటగాడిగా సర్ప్రీత్ సింగ్ అరంగేట్రం చేశాడు.
Sarpreet Singh. You are a trailblazer. Became just the fourth player of Indian heritage to feature at a World Cup, representing New Zealand against Iran. We know progress can be slow, but representation has always mattered and always will. pic.twitter.com/jXIEhzKqEh
— VERSUS (@vsrsus) June 16, 2026
ఆక్లాండ్‌లోని పంజాబ్ దంపతులకు జన్మించిన సర్ప్రీత్ మంగళవారం ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. అటాకింగ్ మిడ్ ఫీల్డర్‌గా బరిలోకి దిగిన అతడు పలుమార్లు గోల్ కొట్టేందుకు ప్రయత్నించాడు. దాదాపు మ్యాచ్ ఆసాంతం మైదానంలో ఆకట్టుకున్న సర్ప్రీత్ 90వ నిమిషంలో డగౌట్‌కు వెళ్లాడు. అయితే.. ఈ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.