Pakistan : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ (Pakistan)కు మరో షాక్. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టుకు జరిమానా పడింది. జూన్ 4 ఆదివారం బర్మింగ్హమ్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు రిఫరీ ఫైన్ విధించారు.
ప్రపంచకప్ ఆరంభ పోరులో 64 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్‌కు ఐసీసీ షాకిచ్చింది. టీమిండియాతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు ఫలితంగా పాక్‌కు మ్యాచ్ ఫీజులో కోత పడింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు క్లేరీ పొలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్, థర్డ్ అంపైర్ సూ రెడ్‌ఫెర్న్, ఎలోసే షెరిడాన్లు స్లో ఓవర్ రేటును గుర్తించారు.
Pakistan have been fined 5% of their match fee for a slow over rate during their 2026 Women’s T20 World Cup match against India at Edgbaston
More details: https://t.co/6zZDdYfQsF pic.twitter.com/zwheelRcU7
— ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2026
పాక్ కెప్టెన్ ఫాతిమా సనా తన పొరపాటును అంగీకరించింది. దాంతో, ఎమిరేట్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ ట్రుడీ అండర్సన్ పాక్ జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా వేశారు. భారత్ నిర్దేశించిన 171 పరుగుల ఛేదనలో పాక్ 106కే కుప్పకూలింది. దీప్తి శర్మ ఐదు వికెట్లు, శ్రీ చరణి మూడు వికెట్లతో చెలరేగడంతో టీమిండియా 64 రన్స్ తేడాతో జయభేరి మోగించింది.