రికార్డ్ ఓపెనింగ్స్.. కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు.. బంగార్రాజు 13 రోజుల కలెక్షన్స్ ఇవీ..

Bangarraju movie collections | అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రమ్య కృష్ణ ,కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని జీ స్టూడీయోస్ , అన్నపూర్ణ స్టూడీయోస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయినా సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైంది. ఈ సినిమా నాగార్జున కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. కేవలం ఐదు రోజుల్లోనే సుమారు 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ చాలావరకు డ్రాప్ అయ్యాయి. దీంతో బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఈ సినిమా అపసోపాలు పడుతోంది. 13 రోజుల్లో బంగార్రాజు సినిమాకు వచ్చిన కలెక్షన్స్ను ఒకసారి గమనిస్తే..
నైజాం : 8.10 కోట్లు
సీడెడ్ : 6.53 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.96 కోట్లు
ఈస్ట్ : 3.97 కోట్లు
వెస్ట్ : 2.79 కోట్లు
గుంటూరు : 3.32 కోట్లు
నెల్లూరు : 1.69 కోట్లు
కృష్ణా: 2.16 కోట్లు
ఏపీ+తెలంగాణ(టోటల్) : 33.52 కోట్లు(54.30 కోట్లు గ్రాస్)
ఓవర్సీస్ : 1.45 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.73 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 36.70 కోట్లు (61.55 కోట్ల గ్రాస్ )
బంగార్రాజు చిత్రానికి 38.15 కోట్ల బిజినెస్ జరిగింది. బాక్సాఫీస్ దగ్గర 39 కోట్ల తో బరిలోకి దిగిన ఈ చిత్రం 13 రోజులు ముగిసేసరికి 33.15 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ చిత్రం క్లీన్ హిట్ సాధించడానికి మరో 2.30 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. ఆంధ్రాలో ఈ చిత్ర కలెక్లన్స్ స్టడీగానే ఉన్నా….నైజాంలో మాత్రం కలెక్షన్స్ తగ్గుతున్నాయి. నైజాంలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమనే చెప్పాలి. కానీ ఓవరల్ మాత్రం బంగార్రాజు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండితులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Kalyan Krishna | బంగార్రాజు దర్శకుడికి నాగార్జున చివాట్లు.. అసలు కారణం ఇదే..
Naga chaitanya | కళ్లతోనే మాయ చేస్తున్న నాగచైతన్య
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

