Karthikeya 2 | వరస విజయాలు, విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త కథలు ప్రయత్నిస్తూనే ఉంటారు ఆయన. అలా నిఖిల్ ప్రతిష్టాత్మక థ్రిల్లర్ కార్తికేయ. ఎనిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ఆ చిత్రంతో తెలుగు తెరకి పరిచయం చేశారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు చందు మొండేటి. తాజాగా మరోసారి కొత్త కథతో ఆయన చేస్తున్న సినిమా కార్తికేయ 2.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు నిర్మాణ సంస్థలు విడివిడిగా ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. తాజాగా నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్లో కార్తికేయ 2 సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మధ్యే కార్తికేయ 2 షూటింగ్ స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్ దేశాల్లో పూర్తి చేసుకుంది. అక్కడి అందమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించారు దర్శకుడు చందు మొండేటి. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కానుంది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. దానికి తోడు అత్యంత భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ అత్యధిక మొత్తానికి సొంతం జీ సంస్థలు చేసుకున్నాయి. కేవలం కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ మాత్రమే విడుదలైనా.. వీటితోనే సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరగడం గమనార్హం. Saviours Emerge in crisis అంటూ ఆ మధ్య విడుదలైన నిఖిల్ బర్త్ డే పోస్టర్లో ఉన్న మ్యాటర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
“నిఖిల్ కార్తికేయ 2 సినిమాపై ఇంత క్రేజ్ ఉందా.. భారీ రేటుకు అమ్ముడైన రైట్స్..”
18 Pages Glimpse video | ప్రేమించడానికి కారణముండకూడదు..’18 పేజెస్’ గ్లింప్స్ వీడియో”
యంగ్ హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్టు.. చేతిలో 4 సినిమాలు ఉన్నాయి కానీ..”
Nikhil Siddhartha | ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా యంగ్ హీరో..”