NHRC | డీజీపీ, హైదరాబాద్ సీపీకి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్ ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరపాలని ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని చెప్పింది. సంధ్య థియేటర్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి రామారావు అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. లాఠీఛార్జి వల్లే రేవతి చనిపోయిందని ఎన్హెచ్ఆర్సీ న్యాయవాది రామారావు పేర్కొన్నారు.