Harish Shankar | ఇక చాలు ఆపండి.. ఏంటీ ఈ ర్యాగింగ్… సినిమాలు అంటేనే సక్సెస్, ఫెయిల్యూర్స్.. ఏ సినిమా సక్సెస్ అయితుందో.. ఏది ఫెయిల్ అవుతుందో ముందే ఎవరూ చెప్పగలరు? అంతమాత్రాన.. ఫెయిల్యూర్ భారం అంతా దర్శకుడిపై ఏసేసి అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా అంటేనే సమిష్టి కృషి.. సక్సెస్, ఫెయిల్యూర్స్ రెండింటిని టీమ్ అంతా పంచుకోవాలి..అంటూ ఆ దర్శకుడికి కొంత మంది సోషల్‌మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు మరికొంత మంది మాత్రం సినిమా ఇంటర్వ్యూల్లో మాత్రం సినిమా అద్భుతం, కళాఖండం అన్నాడు… అందరి మీద సైటైర్స్ వేశాడు..మీడియాతో కూడా అతిగా ప్రవర్తించాడు. తీరా చూస్తే పరమ రొటిన్.. సినిమా.. బోరింగ్ సినిమా తీసి జనాల మీదకి వదిలాడు.
హీరో రవితేజ (Raviteja) అతన్ని నమ్మి ఇంత మంచి అవకాశం ఇస్తే ఇలా చేస్తాడా? ఈ ఫెయిల్యూర్‌కు కారణం అతనే..ఏ మాత్రం అవగాహన లేకుండా సినిమా తీశాడు అని కొంత మంది ఆ దర్శకుడిపై అదే సోషల్‌మీడియాలో ఫైర్ అవుతున్నారు.. ఇంతకి ఆ దర్శకుడు ఎవరో కాదు హరీశ్ శంకర్ (Harish Shankar). ఇటీవల రవితేజతో ఆయన తీసిన చిత్రం మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) ఆగస్టు 15న మంచి పోటీ వాతావరణంలో విడుదలైంది. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి పూర్తి నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి.
హరీశ్ శంకర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ పేరిట.. ఓ రొటిన్ సినిమాను తీశాడని, రైడ్ లాంటి ఓ సీరియస్ కథను అనవసరమైన మార్పులు చేర్పులు ఆ రీమేక్‌ను చెడగొట్టి ఎంటర్టైన్మెంట్ పేరిట నవ్వులపాలు అయ్యాడని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు అనవసరంగా ఆ చిత్ర కథానాయిక భాగ్యశ్రీ బోర్సేని ఆకాశానికి ఎత్తారని, హరీశ్ శంకర్, హీరో, హీరోయిన్ పాత్రల హైలైట్ చేయాలని పెట్టిన శ్రద్ద సినిమాపై పెట్టి వుంటే బాగుండేది అంటున్నారు ఆడియన్స్.
రవితేజ కూడా ఈ కథను ఎలా ఒప్పుకున్నాడు? ఎలా చేశాడని కూడా తమ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు సినిమా చూసిన జనాలు. ఇక దీనికితోడు ఈ సినిమా ప్రచారంలో భాగంగా హరీశ్శంకర్తో చర్చలకు దిగిన జర్నలిస్టులు కూడా హరీశ్శంకర్పై సినిమా విడుదల తరువాత విమర్శలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన చెప్పిన మాటలను ట్యాగ్ చేస్తూ మరీ విమర్శిస్తున్నారు. అయితే ఇక ఇకనైనా ఈ విమర్శలు ఆపండి.. అంటూ కొంత మంది న్యూట్రల్‌గా వున్న నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
Devara Part 1 | పాపులర్ కంపెనీకి తారక్ దేవర ఓవర్సీస్ రైట్స్.. గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్
Nani | ఓజీ డైరెక్టర్ సుజిత్ సినిమాకు బ్రేక్ పడిందా..? నాని క్లారిటీ
Stree 2 | ఫైటర్, కల్కి 2898 ఏడీ రికార్డు బ్రేక్.. ఆ జాబితాలోకి శ్రద్దా కపూర్ స్త్రీ 2 ఎంట్రీ..!