మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాలీవుడ్ ఫన్ ప్రాంఛైజీ ఎఫ్ 3 (F3) రానే వచ్చింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ (Mehreen kaur) హీరోయిన్లుగా ఎఫ్ 2కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లలో స్పందన బాగుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ చెబుతున్నాయి. అందరూ అనుకున్నట్టుగా ఎఫ్ 3లో వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్వించడం ఖాయమంటున్నారు నెటిజన్లు.
వెంకటేశ్, వరుణ్ తేజ్ ఇద్దరూ పోటీ పడి మరి నటించారని చెబుతున్నారు. ఇక వెంకీ కామెడీ టైమింగ్ ఎఫ్ 2ను మించి అదిరిపోయేలా ఉందని, సిల్వర్ స్క్రీన్‌పై వెంకీ కనిపించినంత సేపు కడుపుబ్బా నవ్వడం గ్యారంటీ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని కొందరు అంటుంటే..సెకండాఫ్‌లో వచ్చే కామెడీ ట్రాక్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తారని మరికొందరు అంటున్నారు. అయితే కొన్ని చోట్ల కామెడీ సన్నివేశాలు అంతగా పండలేదని పేర్కొంటున్నారు.
పూజాహెగ్డే స్పెషల్ సాంగ్‌తో గ్లామర్ డోస్ యాడ్ అయిందని టాక్. మెహరీన్, తమన్నా, సోనాల్ చౌహాన్, మురళీశర్మ, సోనాల్ చౌహాన్, సునీల్, ప్రగతి, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్ వారి వారి పాత్రలతో ఎంటర్టైన్మెంట్ అందించారంటున్నారు. మొత్తానికి బాక్సాపీస్ వద్ద ఎఫ్3కి ఎలాంటి కలెక్షన్లు ఉంటాయనేది తెలియాలంటే ఇంకొంత సమయం వెయిట్ చేయాల్సిందే.