Jailer 2 | కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)తో తెరకెక్కించిన జైలర్ బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ జైలర్ 2 (Jailer 2) రాబోతుండగా.. ఈ సినిమాకు హుకుం టైటిల్‌ను పరిశీలిస్తున్నారంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కాగా నెల్సన్ దిలీప్ కుమార్ చేసిన కామెంట్స్ మూవీ లవర్స్, అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. ఇటీవలే ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. అంతా ఫైనల్ అయిపోయింది.. ప్రొడక్షన్ హౌజ్ సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటన చేస్తుందని అన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ తాజా మాటలతో జైలర్ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని అవుతుంది.
ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా నటించారు. మరి సీక్వెల్లో వీరంతా కొనసాగుతారా..? లేదా..? అనేది చూడాలి. ప్రస్తుతం రజినీకాంత్ వెట్టైయాన్, కూలీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. టీజీ జ్ఞానవేళ్ డైరెక్ట్ చేస్తున్న వెట్టైయాన్ అక్టోబర్ 10న విడుదలవుతుంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న కూలీ 2025లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Nani 32 | నాని 32 అనౌన్స్మెంట్ డేట్ ఫైనల్.. ఇంతకీ ఏ సినిమానో మరి..?
Committee Kurrollu | కమిటీ కుర్రోళ్లు ఓటీటీ, టీవీలో సందడి చేసే టైం ఫిక్స్..!