‘NBK 111’ సినిమా ఓపెనింగ్ గత ఏడాది నవంబర్‌లో జరిగింది. అయితే.. షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని బాలకృష్ణ అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అడుగు ఎట్టకేలకు పడింది. కథ విషయంలో రాజీ పడకూడదని, సంతృప్తిగా కథ వచ్చాకే లొకేషన్‌కి వెళ్లాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు మలినేని గోపీచంద్ కాస్త సమయం తీసుకున్నారని చిత్రబృదం చెబుతున్నది. ఎట్టకేలకు ఈ సినిమా కథ లాక్ అయ్యింది.
ముందు అనుకున్నట్టుగా ఇది సోషియో ఫాంటసీ నేపథ్యం కాదు. భావోద్వేగాలతో కూడుకున్న పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. గత చిత్రాలకు భిన్నంగా బాలకృష్ణ ఈ కథలో కనిపిస్తారని సమాచారం. నయనతార ఇందులో కథానాయిక. మార్చి తొలివారంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నది. అభిమానులు పండుగ చేసుకునేలా కథ కుదిరిందని చిత్రబృందం చెబుతున్నది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాత: వెంకటసతీష్ కిలారు, నిర్మాణం: వృద్ధి సినిమాస్.