Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడికి దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న నయనతార ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు బాబులకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్. శివన్, ఉలాగ్ ధైవాగ్ ఎన్. శివన్ అని ఆ పిల్లలకు పేర్లు పెట్టింది నయనతార. నయనతార సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పిల్లలకి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉంటారు, ఇద్దరు బుడి బుడి అడుగులు వేస్తూ నడుస్తున్న ఫోటోలు, వీడియోలను నయనతార గతంలో షేర్ చేసిన విషయం తెల్సిందే.
తాజా గా నయనతార … భర్త విఘ్నేష్ శివన్‌తో ఉన్న రొమాంటిక్ ఫోటోలను మాత్రమే కాకుండా ఇద్దరు కొడుకులతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం సమ్మర్ హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న నయనతార ఫ్యామిలీ సరదాగా తీసుకున్న ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. నయన్, విఘ్నేష్ శివన్ దంపతుల కొడుకులు చూస్తుండగానే పెరిగి పెద్దవుతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. నయనతార ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఇంతలోనే పిల్లలు ఇంత పెద్ద వారు కావడం చూస్తూ ఉంటే కాలం ఎంత స్పీడ్‌గా పరిగెడుతుంది కదా అన్నట్లు అనిపిస్తుందని నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
సౌత్‌లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగిన నయనతార తమిళ నాట దక్కించుకున్న క్రేజ్ వేరు. అక్కడి స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌కి సైన్ చేసింది. ఆ మధ్య ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ జరిగింది. చిరంజీవితో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసింది. భారీ పారితోషికం అందుకుని నయన్ ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. మరో వైపు కోలీవుడ్‌లో రెండు మూడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. త్వరలోనే అవి కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read More>>