న్యూఢిల్లీ, మే 29: ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ..దేశీయ మార్కెట్లోకి అప్‌గ్రేడెడ్ చేసిన నయా స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూపిటర్ 125 డ్యూయల్ టోన్ స్మార్ట్కనెక్ట్ని పరిచయం చేసింది. ఈ స్కూటర్ ధర రూ.88, 942గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
జావా యెజ్డీ.. తాజాగా హైదరాబాద్‌లో మరో షోరూంను తెరిచింది. కంపెనీకి చెందిన వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే మరో షోరూంను ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.