కోలీవుడ్ (Kollywood) స్టార్ కపుల్ నయనతార (Nayantara)-విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ఎప్పుడూ ఏదో ఒక వార్తతో ట్రెండింగ్ అవుతుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరిద్దరికి సంబంధించిన ఆసక్తికర వార్త వెడ్డింగ్ అప్డేట్ (wedding) . ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన అప్డేట్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఇద్దరూ వచ్చే నెలలో వివాహ బంధంతో ఒక్కటవబోతున్నారని తాజా టాక్. అంతేకాదు నయనతార కుటుంబసభ్యులు ఇప్పటికే వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను మొదలుపెట్టారట.
నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ సెర్మనీ తిరుమల టెంపుల్లో సింపుల్‌గా జరుపుకునేందుకు ప్లాన్ చేసుకున్నారని, ఆ తర్వాత వెడ్డింగ్ రిసెప్షన్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెట్ చేసుకున్నారని ఇన్ సైడ్ టాక్. గతేడాది నిశ్చితార్థం పూర్తి చేసుకున్న నయన్-విఘ్నేశ్ పెళ్లికి ముందు ఇండియాలోని ప్రసిద్ధ ఆలయాల్లో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారు.
నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న గాడ్‌ఫాదర్‌లో కీ రోల్లో నటిస్తోంది. మరోవైపు స్టార్ డైరెక్టర్ ఆట్లీ, స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.
Read Also : Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
Read Also : kamal haasan | కమల్ హాసన్‌ను కలిసిన నితిన్ తండ్రి..ప్రమోషన్ ప్లాన్‌పై చర్చ..!
Read Also : Thank You Teaser | లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు..‘థ్యాంక్యూ’ టీజర్