ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 12:33:26

ఇప్ప‌టికీ నన్ను త‌క్కువ కులం వాడిగా చూస్తారు..

ఇప్ప‌టికీ నన్ను త‌క్కువ కులం వాడిగా చూస్తారు..

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ తాజాగా కుల వివ‌క్ష‌త గురించి మాట్లాడారు. లాక్ డౌన్ కార‌ణంగా గ‌త కొన్ని రోజులుగా స్వ‌గ్రామంలోనే ఉంటున్న న‌వాజుద్ధీన్ కొన్ని చేదు అనుభ‌వాల‌ను చ‌విచూశాడట. మా అమ్మమ్మ తక్కువ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి  ఇప్ప‌టికీ న‌న్ను త‌క్కువ కులం వాడిగానే చూస్తారు. ఇంత స్టార్‌డం వ‌చ్చిన‌ప్ప‌టికీ  మా గ్రామంలో నేను లోక్యాస్ట్ ప‌ర్స‌న్‌నే. క‌లుం అనేది వారి వారి న‌ర‌న‌రాల‌లో పాకింది. దీనిని గ‌ర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. షేక్ సిద్ధిఖీలు ఉన్నత కులం అని, వారు ఇత‌రుల‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. వారిలో మార్పు రావ‌డం చాలా క‌ష్టం అని న‌వాజుద్దీన్ చెప్పుకొచ్చారు.

ప్ర‌స్తుతం న‌వాజుద్ధీన్ .. సుధీర్ మిశ్రా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సీరియ‌స్ మెన్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం మ‌నూ జోసెఫ్ ర‌చించిన సీరియ‌స్ మెన్ పుస్త‌కం ఆధారంగా రూపొందుతుంది. ఇందులో న‌వాజుద్దీన్ ద‌ళిత వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడు. 


logo