70th National Film Awards | భారత సినీ సినీ కళాకారులు ప్రతిష్టాత్మకంగా భావించే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులలో కాంతార (Kantara) సినిమా సత్తా చాటింది. ఈ సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ షెట్టి (Rishab Shetty) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడమే కాకుండా.. ఉత్తమ ప్రేక్షక ఆదరణ అందించిన చిత్రంగా కాంతార నిలిచింది.
ఇక మలయాళం ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఆట్టం(Aatam) చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. రణ్‌బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ చిత్రం ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాగా అవార్డు అందుకోగా.. బాలీవుడ్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఉంచాయి సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. ఇక నేషనల్ ఫిలిం అవార్డులు అందుకున్న చిత్రాలు చూడాలని ప్రేక్షకులు వెతుకుతుండగా.. ఏ చిత్రం ఏ ఓటీటీలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Aattam Movie – ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న – ఆట్టమ్ (మలయాళం) చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
Kantara Movie – ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న రిషబ్ షెట్టి కాంతార చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
Uunchai Movie | ఉత్తమ దర్శకుడిగా సూరజ్ బర్జాత్యా అవార్డు అందుకున్న (ఉంచాయి – హిందీ) చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
Thiruchitrambalam Movie | ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న నిత్య మేనన్ (తిరుచిత్రబళం) అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
karthikeya | తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకున్న కార్తికేయ 2 చిత్రం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
Ponniyan Selvan | తమిళ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకు పోన్నియన్ సెల్వన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఇంకా ఇవే కాకుండా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాగా అవార్డు అందుకున్న బ్రహ్మాస్త్ర – పార్ట్ 1 చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) అవార్డు అందుకున్న గుల్మోహర్ కూడా డిస్నీ+ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం ఉత్తమ ప్రాంతీయ చిత్రం సౌది వెళ్లక్క సీసీ 225య/2009 చిత్రం సోనీ లివ్‌లో ఉంది. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అవార్డ్ గెలిచిన ‘కేజీఎఫ్ 2’.. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఉత్తమ బాలనటుడిగా నిలిచిన శ్రీపాథ్ నటించిన ‘మలికాపురమ్’.. హాట్‌స్టార్‌లో ఉంది.
Also read..