Natasa Stankovic : గతేడాది భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా నుంచి విడాకులు తీసుకొని నటాషా స్టాంకోవిక్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. బ్రేకప్ అనంతరం కుమారుడు అగస్త్యతో కలిసి స్వదేశం వెళ్లిపోయిన తను.. తిరిగి భారత్ వచ్చేసింది. అప్పట్నుంచీ ఇన్‌స్టాగ్రామ్‌లో వర్కవుట్ల వీడియోలు పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్న ఈ బ్యూటీ. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ప్రేమకు వ్యతిరేకం కాదని.. మళ్లీ లవ్‌లో పడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది ముద్దుగుమ్మ.
పాండ్యాతో విడాకుల తర్వాత నటాషా మీదనే అందరి దృష్టి నెలకొంది. ఆమె తన స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్‌తో ఔటింగ్ వెళ్తూ.. మీడియా కంటపడింది. అయితే.. అతడే నటాషా కొత్త బాయ్‌ఫ్రెండ్ అనుకుంటున్నారంతా. ? ఈ నేపథ్యంలో నటాషా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, తన భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడింది. ‘కొత్త అనుభవాలను ఆస్వాదించేందుకు సిద్దంగా ఉన్నాను. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ప్రేమ విషయంలోనూ అంతే.
విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ లవ్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నా. నేను ప్రేమకు వ్యతిరేకం కాదు. సరైన సమయం వస్తే.. అన్ని విధాలా నచ్చిన భాగస్వామి దొరకడం ఖాయం. ఆ రోజు కోసం వేచి ఉన్నాను. లవ్ ఒక్కటే కాదు.. పరస్పరం గౌరవించుకుంచుకునే అనుబంధాలనే నేను ఇష్టపడుతాను’ అని నటాషా వెల్లడించింది. అంతేకాదు మళ్లీ ముఖానికి రంగు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిందీ మోడల్.
‘పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యాను. అయితే.. పరస్పర అంగీకారంతో పాండ్యా, నేను విడాకులు తీసుకున్నాం. ఇక నా జీవితంపై దృష్టి సారిస్తున్నా. సినిమాలు మానేసి ఐదేళ్లు అవుతోంది. అయితే.. సుదీర్ఘ విరామం తర్వాత సినీ పరిశ్రమలో పునరగామనం అంత ఈజీ కాదు. పనిని ప్రేమిస్తూ.. కొత్త నైపుణ్యాలను అలవర్చుకునే లక్షణాలు ఉన్న నాకు కెరియర్ ఉంటుందని భావిస్తున్నా’ అని తెలిపింది నటాషా. పాండ్యాతో ప్రేమలో పడిన నటాషా 2020లో పెళ్లి చేసుకుంది. అదే ఏడాది జూలైలో ఈ జంటకు అగస్త్య అనే కుమారుడు జన్మించాడు.