Aay | నార్నే నితిన్ (Nithin), నయన్ సారిక కాంబినేషన్లో గోదావరి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఆయ్’ (Aay) . జంటగా నటిస్తున్నారు. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. ఆయ్ పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు.
తాజాగా ఆయ్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఇంతకీ ఏ రోజు డిజిటల్ ఎంట్రీ ఇస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మిమే గోపి ఇతర కీలక పాత్రల్లో నటించారు. అజయ్ అరసాడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. రామ్ మిర్యాల బాణీలు సమకూర్చాడు.
The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
Devara Part 1 | పాపులర్ కంపెనీకి తారక్ దేవర ఓవర్సీస్ రైట్స్.. గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్
Nani | ఓజీ డైరెక్టర్ సుజిత్ సినిమాకు బ్రేక్ పడిందా..? నాని క్లారిటీ
Stree 2 | ఫైటర్, కల్కి 2898 ఏడీ రికార్డు బ్రేక్.. ఆ జాబితాలోకి శ్రద్దా కపూర్ స్త్రీ 2 ఎంట్రీ..!