నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
నారప్ప సినిమా రాయలసీమ నేపథ్యంలో జరుగుతుంది. సాధారణంగా అక్కడే ఇలాంటి పేర్లు ఉంటాయి. నారపరెడ్డి, నారప్ప ఇలాంటి పేర్లు సీమ వ్యక్తులు ఎక్కువగా పెట్టుకుంటారు.

విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా నారప్ప. జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా విడుదలైంది. అభిమానుల కోసం 2 గంటల ముందుగానే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. దీనికి రివ్యూలు కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఒరిజినల్ సినిమా అసురన్ చూసిన వాళ్లకు నారప్ప అంతగా నచ్చదు అనే కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు తమిళ సినిమా చూడని వాళ్లు మాత్రం ఇక్కడ వెంకటేశ్ నటన చూసి ఫిదా అయిపోతున్నారు. ధనుశ్‌తో పోల్చకుండా సినిమా చూస్తే మన ప్రేక్షకులకు బాగానే ఉన్నాడు నారప్ప. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఒక వివాదం చెలరేగే అవకాశం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విశ్లేషకులు తమ వాదన వినిపిస్తున్నారు.
నారప్ప సినిమా రాయలసీమ నేపథ్యంలో జరుగుతుంది. సాధారణంగా అక్కడే ఇలాంటి పేర్లు ఉంటాయి. నారపరెడ్డి, నారప్ప ఇలాంటి పేర్లు సీమ వ్యక్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. అయితే ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు కేవలం అవి ఇంటి పేర్లుగానే మిగిలిపోయాయి. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఎక్కడో తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా చేసుకుని వెట్రిమారన్ ఈ సినిమా కథ రాసుకున్నాడు. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఉన్నది ఉన్నట్లు చేయడంతో మన దగ్గరి కల్చర్‌కు ఇది సరిపోదు అంటూ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
రాయలసీమలో ఇలాంటి ఆనవాయితీ ఎప్పుడూ లేదని.. కింది జాతి వాళ్లను, తక్కువ కులం వాళ్లను ఇంత నీచంగా ఎప్పుడూ చూడలేదని.. అసలు ఎందుకు రాయలసీమను ఈ విధంగా టార్గెట్ చేసి సినిమా తీశారంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు సీమ నేపథ్యం ఎందుకు పెట్టారు.. అనంతపురం లాంటి ఊర్లలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కేవలం ఫిక్షనల్ అని దర్శక నిర్మాతలు చెబుతున్న కూడా.. ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు కనీసం అలాంటి చిన్న చిన్న విషయాలు చూడాలి కదా అని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. మరి దీనిపై నారప్ప చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Narappa Review : రొటీన్ రీమేక్..
పోర్న్ మూవీస్ కేసు.. జ్యుడీషియల్ కస్టడీకి రాజ్ కుంద్రా
లొకేషన్ లో శర్వానంద్, రష్మిక..షూటింగ్ షురూ
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

