e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News Narappa Review : రొటీన్‌ రీమేక్‌..

Narappa Review : రొటీన్‌ రీమేక్‌..

Narappa Review : రొటీన్‌ రీమేక్‌..

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రీమేక్‌ సినిమా ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాల్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు అగ్ర హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. రీమేక్‌లా విషయంలో మిగతా హీరోలతో పోలిస్తే వెంకటేష్‌ ఓ అడుగు ముందే ఉంటారు. ఆయన కథానాయకుడిగా నటించిన మరో రీమేక్‌ చిత్రం ‘నారప్ప’. తమిళ చిత్రం అసురన్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో జాతీయ అవార్డును వచ్చిన సినిమా కావడంతో ప్రారంభం నుంచే ఈ రీమేక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సెకండ్‌ వేవ్‌ మూలంగా ఈ సినిమా ఓటీటీలో విడుదలకావడం చర్చనీయాంశంగా మారింది. సురేష్‌బాబుతో కలిసి కలైపులి థాను కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇదివరకు కుటుంబ కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించిన శ్రీకాంత్‌ అడ్డాల తన కెరీర్‌లో తొలిసారి చేసిన మాస్‌ సినిమా ఇది. ఈ సినిమా ద్వారా ఓటీటీలో అడుగుపెట్టిన అగ్రహీరో వెంకటేష్‌ ప్రేక్షకుల్ని మెప్పించాడా? లేదా? తన పంథాకు భిన్నంగా శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాను ఎలా తెరకెక్కించాడన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…

- Advertisement -

నారప్ప( వెంకటేష్‌) ఓ రైతు. తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. భార్య సుందరమ్మ(ప్రియమణి), ముగ్గురు పిల్లలే అతడి సర్వస్వం. ఊళ్లో సిమెంట్‌ ఫ్యాక్టరీ కట్టడానికి నారప్ప భూమిని సొంతం చేసుకోవాలని ఆ ఊరి పెద్ద పండుస్వామి(నరేన్‌), అతడి తమ్ముడు దొరస్వామి తమ అధికారబలంతో ప్రయత్నిస్తుంటారు. వారిని నారప్ప పెద్దకొడుకు మునిఖన్నా(కార్తిక్త్న్రం) ఎదురిస్తాడు.

పండుస్వామి మనుషులు మునిఖన్నాను చంపుతారు. తన అన్నను చంపిన పండుస్వామిని నారప్ప చిన్నకొడుకు సిన్నబ్బ అంతం చేస్తాడు. ఆ కోపంతో నారప్ప కుటుంబాన్ని చంపేందుకు పండుస్వామి కొడుకు, అతడి తమ్ముడు పంతం పడతారు. వారి బారి నుంచి నారప్ప తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఎప్పుడూ శాంతంగా కనిపించే నారప్ప జీవితంలో తెలియని కోణాలేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

పెత్తందారులకు, పేదవాడికి మధ్య అంతరాలను ఆవిష్కరిస్తూ తెలుగు తెరపై అనేక సినిమాలొచ్చాయి. వాటి ఛాయలతోనే సాగే చిత్రమిది. అంగబలం, అర్ధబలంతో పాటు సామాజిక కట్టుబాట్ల పేరుతో పేదవాడిని అణగదొక్కేందుకు డబ్బున్న వాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ అన్యాయాలపై పోరాడే క్రమంలో సామాన్యుడు ఎదుర్కొనే సంఘర్షణను ఆవిష్కరిస్తూ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి సన్నివేశంతోనే నేరుగా కథలోకి వెళ్లిన దర్శకుడు బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో కథాగమనాన్ని నడిపించారు.

పండుస్వామి మనుషుల నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి నారప్ప ప్రయత్నించడం, ఊరి పెద్దలను ఎదురించి మునిఖన్నా చేసే పోరాటంతో ప్రథమార్థం సాగుతుంది. నారప్ప ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌తో పాటు తన కొడుకును చంపబోతున్న పండుస్వామి కుటుంబాన్ని నారప్ప అంతమొందించే సన్నివేశాలతో ద్వితీయార్థాన్ని దర్శకుడు నడిపించారు. విరామ సన్నివేశాల ముందుకు వచ్చే పోరాట ఘట్టంతో పాటు పతాక ఘట్టాల్ని వినూత్నంగా తీర్చిదిద్దారు.

సాధారణంగా రీమేక్‌లను తెరకెక్కించే విషయంలో దర్శకులు తమ శైలికి అనుగుణంగా కథలో అనేక మార్పులు చేస్తుంటారు. నారప్ప విషయంలో శ్రీకాంత్‌ అడ్డాల మార్కు ఎక్కడ కనిపించలేదు. మాతృకను సీన్‌ టూ సీన్‌ తమిళ మాతృకను తెలుగులో కాపీ చేశారు. ఆర్టిస్టులు మినహా తెలుగు నేటివిటీ కోసం దర్శకుడు ఎలాంటి మార్పులు చేయలేదు. నారప్ప పాత్ర చేయడంలో వెంకటేష్‌ కూడా ధనుష్‌ను అనుసరించిన భావన కలుగుతుంది. ఉద్వేగాల్ని పలికించే విషయంలో, సంభాషణలు చెప్పడంలో మాతృకను యథాతథంగా ఫాలో అయ్యారు.

వాటి వల్ల ఆయన రెగ్యులర్‌ ైస్టెల్‌ యాక్టింగ్‌ చాలా వరకు మిస్సయి పాత్రలో అసహజత్వం కనిపించింది. దాంతో నారప్ప రీమేక్‌ సినిమాల కాకుండా డబ్బింగ్‌ సినిమా చూస్తోన్న అనుభూతిని కలిగించింది. తండ్రి పాత్రలో వెంకటేష్‌ నటన బాగున్నా ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో మాత్రం సరిగ్గా కుదరలేదు ఆ సన్నివేశాల విషయంలో చిత్రబృందం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. తమిళంలో కథాగమనం నిదానంగా సాగుతుంది. ఆ వేగం తెలుగులో లోపించింది. చివరకు నేపథ్య సంగీతం, షూటింగ్‌ లొకేషన్స్‌ విషయంలో మాతృకనే అనుసరించడం బాగాలేదు. కులాలు, జాతుల మధ్య వైరంలా కాకుండా కేవలం రెండు కుటుంబాల మధ్య గొడవలా ఈ సినిమాను వివాదాలకు తావు లేకుండా తెరకెక్కించారు. అయితే ఈ తరహా కథలతో తెలుగులో లెక్కకు మించిన సినిమాలొచ్చాయి. పాత సినిమాలన్నింటిని ఈ చిత్రం గుర్తుకుతెస్తుంది తప్పితే కొత్తదనం ఎక్కడ కనిపించదు.

నారప్పగా రెండు భిన్న పార్శాలున్న పాత్రలో వెంకటేష్‌ కనిపించారు. ఈ పాత్రల మధ్య వైవిధ్యాన్ని ప్రదర్శించిన తీరు బాగుంది.ఎమోషనల్‌ సన్నివేశాల్లో కొన్ని చోట్ల వెంకటేష్‌ నటన కంటతడిపెట్టిస్తుంది. సుందరమ్మగా ప్రియమణి సహజ నటనతో ఆకట్టుకున్నది. వెంకటేష్‌ తనయులుగా కార్తిక్త్న్రం, రాఖీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజీవ్‌ కనకాల, రావురమేష్‌, నాజర్‌లు తమ నటనానుభవంతో మెప్పించారు. మణిశర్మ నేపథ్య సంగీతంలో థీమ్‌ సాంగ్‌ ఆకట్టుకుంటుంది. పీరియాడికల్‌ కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో 1990 దశకం నాటి వాతావరణాన్ని ఆర్ట్‌ డైరెక్టర్‌తో పాటు కెమెరామెన్‌ శ్యామ్‌ కెనాయుడు చక్కగా పునఃసృష్టించగలిగారు.

రొటీన్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. వినూత్న కథాంశాలతో ఓటీటీ మాధ్యమాల్లో సినిమాలు రూపొందుతున్న ప్రస్తుతం తరుణంలో ఇలాంటి కథాంశాల్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది అనుమానమే. అసురన్‌ చూడని వారిని ఈ సినిమా కొంతవరకు మెప్పిస్తుంది.
రేటింగ్‌: 2.5/5

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Narappa Review : రొటీన్‌ రీమేక్‌..
Narappa Review : రొటీన్‌ రీమేక్‌..
Narappa Review : రొటీన్‌ రీమేక్‌..

ట్రెండింగ్‌

Advertisement