HIT : The Third Case : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాని(Nani) నటించిన తాజా చిత్రం ‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ‘హిట్ 3’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాని కెరీర్లోనే అత్యంత వేగంగా బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటి, నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది.
‘హిట్’ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ మూడో చిత్రంపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని అందుకుంటూ, హిట్ 3 సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమైంది. నాని నటన, శైలేష్ కోలను కథనం, దర్శకత్వం సినిమా విజయానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు. తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో, నాని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆనందిస్తున్నారు.