పరిగి : దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా మద్దతు పలుకుతామని పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి ( MLA Rammohan Reddy ) అన్నారు. ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor ) ద్వారా ఉగ్రవాదులను అంతమొందించిన భారత సైన్యానికి ( Indian Army) సంఘీభావంగా గురువారం పరిగిలోని కొడంగల్ క్రాస్‌రోడ్డులో నిర్వహించిన ప్రదర్శనలో ఎమ్మెల్యే మాట్లాడారు.
భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసినందుకు సైన్యానికి సెల్యూట్ చెప్పారు. భారత దేశ పౌరులను, ఎల్లవేళలా దేశాన్ని కాపాడుతున్న సైన్యం సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. దేశ భద్రత విషయంలో పార్టీలకతీతంగా మద్దతు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు లాల్‌క్రిష్ణప్రసాద్, పాలాది శ్రీనివాస్, చిన్న నర్సింలు, విజయకుమార్‌రెడ్డి, హన్మంతు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.