Saripodhaa Sanivaaram | సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని 31గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా సూర్య మ్యాడ్నెస్ స్టైల్‌తో సాగే గరం గరం సాంగ్ (Garam Garam) సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా మేకర్స్ గరం గరం వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
వీడియో సాంగ్ విజువల్స్ థియేటర్లలో నాని మేనియాను మిస్సయిన మూవీ లవర్స్‌లో జోష్ నింపేలా సాగుతున్నాయి. ముఖ్యంగా నాని సగం గీసిన గడ్డంతో చేసే ఫైట్ సన్నివేశాలను అభిమానులను ఇంప్రెస్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో రిలీజయింది.
నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన ఈ రెండో ప్రాజెక్టులో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా.. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటించాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించింది.
#GaramGaram Video Song OUT NOW https://t.co/Fdeeq5skWc#SaripodhaaSanivaaram pic.twitter.com/pcAZHvgT2w
— BA Raju’s Team (@baraju_SuperHit) September 17, 2024
గరం గరం వీడియో సాంగ్..
Jani Master | పెద్ద హీరో ఆ అమ్మాయికి సినిమాలో అవకాశమిస్తామన్నారు.. జానీ మాస్టర్ వివాదంపై ఝాన్సీ